ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీడ్‌ పత్తి రైతుల సమస్యలపై దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2021-10-25T04:44:38+05:30

నడిగడ్డ ప్రాంతంలో సీడ్‌ పత్తిని సాగు చేస్తూ కష్టాలపాలవుతున్న రైతాం గం సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఏఐటీయూసీ జా తీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న విజయలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి 

గద్వాల టౌన్‌, అక్టోబరు 24 : నడిగడ్డ ప్రాంతంలో సీడ్‌ పత్తిని సాగు చేస్తూ కష్టాలపాలవుతున్న రైతాం గం సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఏఐటీయూసీ జా తీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి అన్నారు. 30ఏళ్లుగా సీడ్‌ పత్తి సాగు చేస్తున్న రైతుల్లో అత్యధి కులు అప్పులపాలై భూములను అమ్ముకునే పరిస్థితి ఉండగా, ఆర్గనైజర్లు కంపెనీలు మాత్రం కోట్లకు ప డగలెత్తుతుండటాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీ సుకోవాల్సి ఉంటుందన్నారు. పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ లే బర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌ఓ) జిల్లా స్థాయి వర్క్‌ షాపు లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. ఒక వైపు రైతుల దుస్థితి ఇలా ఉంటే సీడ్‌ పత్తి సాగు వల్ల జోగుళాంబ గద్వాల జిల్లాలో బాలకార్మికుల సంఖ్య అధికసంఖ్యలో ఉండటం ఆందోళనకరమ న్నా రు. బడీడు పిల్లలను విధిగా పాఠశాలలకు పంపాల ని ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా రైతుల ఆర్థికస్థితి గతుల్లో మార్పు రానంత వరకు బాలలను పనిలో ఉంచేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారన్నది వాస్తవ విషయమన్నారు. ఈ క్ర మంలో ఐఎల్‌వో తరఫున జిల్లా అంతటా విస్తృంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనం దించడం, కుటుంబాలకు ఆర్థికసాయం చేయడం ద్వారా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. ఆం జనేయులు, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ బాలగోపాల్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రావు, ఐఎల్‌ఓ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్కటరీ రంగన్న, కో ఆర్డినేటర్‌ వీ రాంజనేయులు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T04:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising