ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిలావస్థలో పాఠశాలలు

ABN, First Publish Date - 2021-11-28T04:18:54+05:30

మండల కేంద్రంతో పాటు తంగిడి, కూసుమూర్తి, సూకూర్‌ లింగంపల్లి తదితర గ్రామాల్లో పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకొని నేడో, రేపో కూలడానికి సిద్ధంగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

శిథిలావస్థకు చేరుకున్న సూకూర్‌ లింగంపల్లి పాఠశాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

కృష్ణ, నవంబరు 27 : మండల కేంద్రంతో పాటు తంగిడి, కూసుమూర్తి, సూకూర్‌ లింగంపల్లి తదితర గ్రామాల్లో పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకొని నేడో, రేపో కూలడానికి సిద్ధంగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన పాఠశాల భవనాల కప్పులు పెచ్చులు ఊడటంతో పాటు గోడలు బీటలు వారినట్లు తెలిపారు. ప్రతీ పాఠశాలలో 50 నుంచి 100 మంది విద్యార్థులు హాజరవు తున్నారని,  జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల భవనాలకు కనీసం రంగులు కూడా వేయడం లేదని, అదే విధంగా పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు మొలవడంతో పాటు మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి నూతన భవనాలు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-28T04:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising