సాయిజ్యోతికి సావిత్రిభాయి ఫూలే అవార్డు
ABN, First Publish Date - 2021-01-02T03:26:50+05:30
నల్లమల ప్రాంతానికి చెందిన ప్రముఖ కవయిత్రి డాక్టర్ పోల సాయిజ్యోతి సావిత్రిభాయి ఫూలే అవార్డుకు ఎంపికయినట్లు ఫూలే ఫౌండేషన్ నిర్వాహకులు టి.బడేసాబ్, గోపి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాయిజ్యోతి (ఫైల్)
అచ్చంపేట, జనవరి 1: నల్లమల ప్రాంతానికి చెందిన ప్రముఖ కవయిత్రి డాక్టర్ పోల సాయిజ్యోతి సావిత్రిభాయి ఫూలే అవార్డుకు ఎంపికయినట్లు ఫూలే ఫౌండేషన్ నిర్వాహకులు టి.బడేసాబ్, గోపి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సావిత్రి భాయి ఫూలే పేరు మీద ఫూలే ఫౌండేషన్, వాల్మీకి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3న హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఈ అవార్డును అందించనున్నట్లు వారు పేర్కొన్నారు.
Updated Date - 2021-01-02T03:26:50+05:30 IST