ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు చేరువగా పాలన

ABN, First Publish Date - 2021-05-11T05:14:36+05:30

మహ్మదాబాద్‌ నూతన మండలంగా ఏర్పాటు కావడంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ కానున్నదని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

మహ్మదాబాద్‌ మండల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- త్వరలో కార్యాలయాలు, అధికారుల నియామకాలు చేపడతాం  8 చిన్న మండలాలతోనే అభివృద్ధి వేగవంతమవుతుంది

- పీఆర్‌ఎల్‌ఐ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం 8 పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

- మహ్మదాబాద్‌ నూతన మండల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి


గండీడ్‌, మే 10 : మహ్మదాబాద్‌ నూతన మండలంగా ఏర్పాటు కావడంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ కానున్నదని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గండీడ్‌ మండలంలో ఉన్న మహ్మదాబాద్‌ నూతన మండలంగా ఏర్పాటైంది. ఈ సందర్భంగా సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో కలిసి నూతన మండల కార్యాలయాన్ని శి లాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. అక్కడే తహసీల్దార్‌, విద్యా, వ్యవ సాయ శాఖల కార్యాలయాలు, రైతు వేదికలను ప్రారంభించారు.  అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గండీడ్‌ మండలం చాలా పెద్దదని అన్నారు. దీని వల్ల ప్రజలకు పాలన కొంత ఇబ్బం దికరంగా మారడంతో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ గండీడ్‌ నుంచి మహ్మదాబాద్‌ అనే మరో మండలాన్ని ఏర్పాటు చేయడం జరి గిందని అన్నారు. త్వరలో మండల కార్యాలయాలు, అధికారుల నియామకం జరుగుతుందని చెప్పారు. చిన్న క్లస్టర్లు ఏర్పాటైతే అధికారులు మరింత ఉత్సా హంగా పని చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం మ రింత  వేగవంతం అవుతుందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి ఇస్తున్నారని, రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నారని, వ్యవసాయంపై మళ్లీ రైతుల్లో ఆశ ఏర్పడిందని చెప్పారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జ్వరం వచ్చిందంటే డాక్టర్‌ను సంప్రదించాలని, నిర్లక్ష్యం చేయరాదని మంత్రి కోరారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ మహ్మదాబాద్‌ నూతన మండలంగా ఏర్పాటు కావడం సంతోషంగా ఉం దన్నారు. ఈ సందర్భంగా సీఎంకు మండల ప్రజల తరుపున ధన్యవాదాలు తె లుపుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఆర్డీవో పద్మశ్రీ, సర్పంచ్‌ పార్వతమ్మ, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, ఎంపీటీసీ చెన్న య్య, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

  



Updated Date - 2021-05-11T05:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising