వరి సాగు అంతంతే..
ABN, First Publish Date - 2021-12-28T04:56:21+05:30
వరి సాగు చేయవద్దనే ప్ర భుత్వ ప్రచారంతో జిల్లాలో యాసంగిలో వరి సాగు అంతంత మాత్రమే కన్పిస్తోంది.
- అయోమయంలో రైతాంగం
- ఆరుతడి పంటల వైపు అన్నదాతల మొగ్గు
- పంట మార్పిడితో ప్రయోజనమంటున్న అధికారులు
- వర్షాకాలం జిల్లాలో లక్షా 44వేల 860 ఎకరాలలో వరి సాగు
వనపర్తి అర్బన్, డిసెంబరు 27 : వరి సాగు చేయవద్దనే ప్ర భుత్వ ప్రచారంతో జిల్లాలో యాసంగిలో వరి సాగు అంతంత మాత్రమే కన్పిస్తోంది. ప్రభుత్వం, అధికారులు విస్తృతంగా అవ గాహన కల్పిస్తుండటంతో రైతులు వరి సాగుకు వెనకడుగు వే స్తున్నారు. ఈ క్రమంలో ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపు తున్నారు. ఈసారి కొత్తరకం పంటల సాగు చేసేందుకు సమా యత్తమవుతున్నారు. ఆరుతడి గింజల కోసం మాత్రమే కుటుం బాలకు కావాల్సిన మొత్తంలో వరి వేస్తూ మిగతా భూమిలో వరి, ఇతర పంటలను సాగు చేయడంపై దృష్టి పెట్టారు.
గతంలో..
జిల్లాలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి 4 లక్షల 77వేల ఎకరాలు ఉంది. ఇందులో దాదాపు వానాకాలంలో 2లక్షల 50వేల ఎకరాలు సాగవుతుంది. గత యాసంగిలో లక్షా 44వేల 860 ఎకరాల్లో వరి సాగవుతుంది. వరి సాగు ఇంకా పెరుగు తుండటం, పలు కారణాలతో వరికి ఇతర రాష్ర్టాల్లో డిమాండ్ తగ్గిపోయింది. ఈ ఏడాది రానున్న యాసంగి సీజన్, ఎఫ్‌సీఐ ద్వారా ప్రభుత్వపరంగా ధాన్యం కొనుగోళ్లు చేయలేమని, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసుకోవా లని, ఇకనుంచి ధాన్యం కొనుగోలు చేయలేమని, కేంద్రం చేసిన స్పష్టమైన ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం వరిపై ఆంక్షలు జారీ చేసిన విషయం తెలిసిందే. సాగు చేయవద్దని, సాగుచేసినా ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసు కోవాలని, ఇకనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని హెచ్చరికలు వచ్చాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన
వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్పష్టమైన వైఖరి తెలియ జేయడంతో ఆయన ప్రత్యామ్నాయ పంట లపై వ్యవసాయ శాఖ అధికారులకు సూచించడంతో అధికా రులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్లు, ఇతర అధికారులతో పాటు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు ఆ బాధ్యతలను అప్పగించడంతో గ్రామాలకు వెళ్లి రైతులకు అవ గాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో పండిన వరి ధాన్యం కొనుగోలు సరిగా నడవని పరిస్థితితో రైతులు కల్లాల్లో, రోడ్లమీద, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులుగా పోసి నిరీక్షిస్తున్న పరిస్థితి తెలి సిందే. ఇలాంటి పరిస్థితి లేకుండా ముందునుంచే రైతులకు ప్రభుత్వం, అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పిం చి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయోమయంలో రైతాంగం
ప్రస్తుతం వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో యాసంగిలో ఏ పంటలు పండించాలనే అం శంపై రైతులు అయోమయానికి గురవుతున్నారు. వాతావరణ పరిస్థితులు, ఇతర పరిణామాలు, అంశాలను బేరీజు వేసుకుంటూ ఏ పంటలు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై అవ గాహన కల్పించిన పంటలు చేతికి వచ్చే సరికి ధరలు ఉంటా యో లేక భయాందోళనకు గురవుతున్నారు.
Updated Date - 2021-12-28T04:56:21+05:30 IST