ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష యువ గళ గీతార్చన కరపత్రం విడుదల

ABN, First Publish Date - 2021-10-20T05:03:22+05:30

గీత జయంతి సందర్భంగా డిసెంబరు 14న విశ్వహిందూ పరిషత్‌ తలపెట్టిన లక్షగళ గీతార్చన కరపత్రాలను బాలానగర్‌ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలానగర్‌, అక్టోబరు 19 : గీత జయంతి సందర్భంగా డిసెంబరు 14న విశ్వహిందూ పరిషత్‌ తలపెట్టిన లక్షగళ గీతార్చన కరపత్రాలను బాలానగర్‌ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ మండల శాఖ అధ్యక్షుడు హను మంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం డిసెంబరు 14న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 18 నుంచి 40 ఏళ్ల వరకు ఉన్నవారు గీత జ యంతిలోగా 40శ్లోకాలను నేర్చుకున్న వారు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పీఠాధిపతులు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గౌతాపూర్‌ శ్యామ్‌, శ్రీకాంత్‌, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్యాం ప్రసాద్‌, ప్రభాకర్‌, నవీన్‌, సునీల్‌, రమేష్‌, అవినాష్‌ పాల్గొన్నారు. 


24న మాదిగ ఉద్యోగుల మహాసభ


పాలమూరు, అక్టోబరు 19 : 24వ తేదీన హైదరాబాద్‌లో మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ మహాసభను నిర్వహిస్తున్నట్లు మునిసిపల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్‌ బి.ఆంజనేయులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎంఈఎఫ్‌ మహాసభ కరపత్రా న్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్గీకరణ చట్టబద్ధత కోసం చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సభకు ఎంఈఎఫ్‌, ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో శ్రీరాములు, కె.కేశవులు, బి.రాజారాం, డి.కేశవులు, గోపి, నరేష్‌, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, శంకరయ్య, రాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising