ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పూలే వర్ధంతి

ABN, First Publish Date - 2021-11-29T03:54:21+05:30

మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌ బాలికల హాస్టల్‌లో పూలే చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న కేవీపీఎస్‌ నాయకులు, హాస్టల్‌ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 28: మహాత్మా జ్యోతిబా పూలే  వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక బాలికల వసతి గృహం ఆవరణంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాశన్న మాట్లాడుతూ సమాజంలో అసమానతలు రూపుమాపడానికి, బడుగు, బలహీన వర్గా ల అభ్యున్నతికి తన జీవితాంతం పాటు పడిన మహనీ యుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆకాంక్షించా రు.  సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు రామయ్య, హాస్టల్‌ వార్డెన్‌ రాధ, విద్యార్థినులు పాల్గొన్నారు.

 పూలేకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాళి

 మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్ర పటానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పూలే అడుగు జాడల్లో నడిచి సామాజిక అభివృద్ధి వైపు నేటి యువత అడుగులు వేయాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రాంథాలయాల సంస్థ చైర్మన్‌ మాధవరం హన్మంతరావు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  


 బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్ర పటానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్‌ పూల మాలలు వేసి ని వాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుంభం మ ల్లేష్‌గౌడ్‌, నాయకులు ప్రకాష్‌, బుడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-11-29T03:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising