ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థలను సిద్ధం చేయండి

ABN, First Publish Date - 2021-01-17T03:59:15+05:30

వచ్చే నెలలో విద్యాసంస్థలు ప్రారంభమ వుతున్నందున తరగతి గదులతోపాటు పరిసరాలను శుభ్రం చేయా లని కలెక్టర్‌ హరిచందన సంబంధిత శాఖల అఽధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అధికారులను  ఆదేశించిన కలెక్టర్‌ హరిచందన



నారాయణపేట టౌన్‌, జనవరి 16 : వచ్చే నెలలో విద్యాసంస్థలు ప్రారంభమ వుతున్నందున తరగతి గదులతోపాటు పరిసరాలను శుభ్రం చేయా లని కలెక్టర్‌ హరిచందన సంబంధిత శాఖల అఽధికారులను ఆదేశించారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి 9వ తరగతి ఆపై బడిన తరగతులు, కళాశాలల తరగతులను ప్రారం భించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందున  పరిశుభ్రం చేసి జనవరి 25వ తేదీలోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశిం చారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో మొలచిన పిచ్చిమొక్కల తొల గించి, చిన్నచిన్న మరమ్మతులు చేయించడం, మరుగుదొడ్ల శుభ్రతను చేపట్టా లని సూచించారు. హాస్టళ్లలో శానిటైజర్‌ చేయాలని, నిల్వ ఉంచిన ధాన్యాలను ఒకటికి రెండుసార్లు చూడాలని హాస్టల్‌ నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు. పాఠశాలలను శుభ్ర పరిచేందుకు కమిషనర్‌, డీపీఓ వారి సిబ్బందితో శుభ్రం చేయించేందుకు ఉపాధ్యాయులు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఈఓ రవీందర్‌, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఎస్సీ, ఎస్టి, బీసీ వెల్ఫేర్‌, మైనార్టీ, మునిసిపల్‌ కమిషనర్లు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T03:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising