ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీతోనే ప్రజారంజక పాలన : మురళీధర్‌రావు

ABN, First Publish Date - 2021-03-09T04:43:41+05:30

బీజేపీతోనే ప్రజారంజక పాలన సాధ్యమవుతుందని మధ్య ప్రదేశ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావు తెలిపారు. కల్వకుర్తిలో సోమవారం నిర్వ హించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

కల్వకుర్తిలో మాట్లాడుతున్న మురళీధర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్వకుర్తి టౌన్‌, మార్చి 8 : బీజేపీతోనే ప్రజారంజక పాలన సాధ్యమవుతుందని మధ్య ప్రదేశ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావు తెలిపారు. కల్వకుర్తిలో సోమవారం నిర్వ హించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం అనంతరం కేసీఆర్‌ కుటుంబం తప్పా, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఇసుమంతైనా సం తోషంగా లేరన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు నాంది పలుకాలని, విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు మరోసారి రామచందర్‌ రావును ఆశీర్వదించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ తరుపున బరిలో నూటికి నూరు శాతం ఓడిపోతా మని ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో, కాంగ్రెస్‌కు చెందిన వాణీదేవిని బరిలో దింపారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేస్తే గెలిచిన అనంతరం పార్టీ మారడం తప్ప వారితో ఒరిగేది ఏం లేదన్నారు. జాతీయ కమిషన్‌ బీసీ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు తోడు దొంగలని, ఆ పార్టీలకు ఓటు వేస్తే ప్రజలకు ఒరిగేది ఏం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేతలు కృష్ణగౌడ్‌, రాఘవేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-09T04:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising