ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్షపూరిత అరెస్ట్‌లు మానుకోవాలి

ABN, First Publish Date - 2021-05-17T05:39:47+05:30

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌ గౌడ్‌ను పోలీసుల చేత అక్రమ అరెస్ట్‌ చేయించి బెదిరించడం విడ్డురంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బాలవర్దన్‌గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బాలవర్దన్‌గౌడ్‌

బాదేపల్లి, మే 16 : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌ గౌడ్‌ను పోలీసుల చేత అక్రమ అరెస్ట్‌ చేయించి బెదిరించడం విడ్డురంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బాలవర్దన్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా మహమ్మారికి గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన యుగంధర్‌గౌడ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి అరెస్టు చేయించడాన్ని ఆయన త్రీవంగా ఖండించారు. మంత్రి కక్షపూరితంగానే బీసీ నాయ కులను, ప్రజలను ఎదగనీయకుండా చేస్తున్నారని మండిపడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరును, రోగులకు అందుతున్న సేవల గురించి మాత్రమే యుగంధర్‌గౌడ్‌ ఆరా తీశారని గుర్తు చేశారు. వెంటనే  మంత్రి నిరంజన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బాలవర్దన్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-17T05:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising