ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీడీలు చెల్లించి నాలుగేళ్లయినా గొర్రెల పంపిణీ ఏదీ

ABN, First Publish Date - 2021-10-29T05:35:48+05:30

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కాపరులను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంలో డీడీలు చెల్లించి నాలుగేళ్లయినా ఇప్పటి వర కు గొర్రెలను ఎందుకు పంపిణీ చేయలేదని పశు సంవర్దక శాఖ వైద్యులు డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ను కాపరులు నిలదీశారు.

అమరచింతలోని బీరప్ప దేవాలయంలో సమావేశమైన గొర్రెల కాపరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశు సంవర్దక శాఖ వైద్యులను నిలదీసిన గొర్రెలకాపరులు 

అమరచింత, అక్టోబరు 28 : రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కాపరులను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంలో డీడీలు చెల్లించి నాలుగేళ్లయినా ఇప్పటి వర కు గొర్రెలను ఎందుకు పంపిణీ చేయలేదని పశు సంవర్దక శాఖ వైద్యులు డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ను కాపరులు నిలదీశారు. గురువారం వనపర్తి జిల్లా అమరచింత  పట్టణంలోని 8వ వార్డులో బీరప్ప గుడిలో గొర్రెలకాపరుల సమావేశంలో వెటర్నరీ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత గొర్రెల పంపిణీ పథకంలో మార్పులు జరిగాయని ఒక యూనిట్‌కు అదనంగా రూ.12,500 డీడీ చెల్లించాలని వియ్‌కుమార్‌ గొర్రెలకాపరులకు సూచించారు. ఆ గొర్రెల కాపరులు కోపోద్రిక్తులై నాలుగు ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయలేదని, అప్పట్లో ఒక్కొక్క యూనిట్‌కు రూ. 31,250 ప్రకా రం 53 యూనిట్లకు డీడీలు చెల్లించామని తెలి పారు. డీడీల ప్రకారం పంపిణీ చేయాలని గొర్రెల పెంపకందారుల సంఘం నాయకులు కుర్వ కృష్ణయ్య, గోపి, అంజి డిమాండ్‌ చేశారు. సమావేశానికి వచ్చిన వైద్యుల్ని దాదాపు రెండు గంటల పాటు బీరప్ప దేవాలయంలోనే కూర్చోబెట్టి గొర్రెల కాపరులు సమావేశమయ్యారు. ఆ వైద్యులు దిక్కుతోచని పరిస్థితిలపై అధికారులకు ఫోన్‌ ద్వారా మాట్లాడి కాపరులందరికీ పంపిణీ జరిగేటట్లు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంలో కాపరులు శాంతించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రాజశేఖర్‌ రెడ్డి, సాయికుమార్‌, బీరప్ప, రఘు, నరసింహ, నాగరాజు, కుర్వ గోవిందు, ఇమిల్లన్న   పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-29T05:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising