ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

ABN, First Publish Date - 2021-11-29T04:10:42+05:30

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన పేర్కొన్నారు.

మక్తల్‌ మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన

మక్తల్‌, నవంబరు 28 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన పేర్కొన్నారు. ఆదివారం మక్తల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికా రులు, ఎస్పీతో కలిసి కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. ప్రైవేటులో దళారులకు విక్రయించి నష్టపోరాదన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పులకు తేమ శాతం తగ్గడం లేదని రైతులు కలెక్టర్‌కు విన్నవించగా ప్రభుత్వ నిర్ణయం మేరకు తేమశాతం ఉండాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఇప్పటి వరకు మార్కెట్‌కు 30వేల గన్నీ బ్యాగులు వచ్చాయని ఇప్పటి వరకు 21మంది రైతులకు టోకెన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు మండలంలోని మాధ్వార్‌ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌, ఎస్పీ తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధి కారులు జాన్‌సుధాకర్‌, దైవగ్లోరి, మక్తల్‌ వ్యవసాయాధికారి మితున్‌ చక్రవర్తి, ఏఈవోలు విజయ్‌కుమార్‌ గౌడ్‌, శివకుమార్‌, మార్కెట్‌ అధికారి బాలమణి, సీఐ శంకర్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T04:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising