ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటితో ముగియనున్న ‘ముస్కాన్‌’

ABN, First Publish Date - 2021-07-31T04:25:38+05:30

‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ బాలలను బంధ విముక్తులను చేసింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో నెల రోజులు గా జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారం ముగియనున్నది.

పాలమూరు జిల్లాలో ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’లో చేరదీసిన చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పాలమూరు, నారాయణపేట జిల్లాల్లో 224 మంది పిల్లల గుర్తింపు


మహబూబ్‌నగర్‌/నారాయణపేట క్రైం, జూలై 30 : ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ బాలలను బంధ విముక్తులను చేసింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో నెల రోజులు గా జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారం ముగియనున్నది. పాలమూరు జిల్లాలో 163 మంది బాలలను చేరదీయగా, ఇందులో ఏడుగురు బాలికలు ఉన్నారు. నారాయ ణపేట జిల్లాలో 61 మంది బాలలను గుర్తించారు. పాలమూరులో చేరదీసిన బాలలను ఆనందనిలయం, బాలసదన్‌, స్టేట్‌ హోమ్‌లకు తరలించారు. వీరి తల్లిదండ్రులను పి లిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. వీరికి త్వరలో కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులకు రూ.2.37 లక్షలు బాలలకు పరిహారంగా చెల్లించాలని ని ర్ణయించారు. ఐదు మంది యజమానులపై పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశా రు. మళ్లీ నెల రోజుల తరువాత  తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి సీడబ్ల్యూసీ, సీడీపీవో ముందు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ సమయంలో పరిహారం కూడా ఇవ్వనున్నారు.

Updated Date - 2021-07-31T04:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising