ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇష్టానుసారంగా ఎజెండా రూపకల్పన

ABN, First Publish Date - 2021-10-29T04:56:42+05:30

ఎవరి కడుపులు నింపేందుకు ఇష్టానుసారంగా ఎజెండాను తయా రు చేశారంటూ కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ దేవన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం

- 12 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం

- అయిజ అభివృద్ధికి రాజకీయాలే అడ్డు : మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న

అయిజ టౌన్‌, అక్టోబరు 28 : ఎవరి కడుపులు నింపేందుకు ఇష్టానుసారంగా ఎజెండాను తయారు చేశారంటూ కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిజ ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో గురువారం చైర్మన్‌ దేవన్న ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పాటు సొంత పార్టీ వారే అయిజ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎవరికీ భయపడేది లేదని, అయి జను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ చైర్మన్‌, కమి షనర్‌ నర్సయ్య ప్రభుత్వ సిబ్బందిని డ్రైవర్లుగా పెట్టుకోవడం విడ్డూరమని విమర్శించారు. దీంతో చైర్మన్‌, కౌన్సిలర్ల మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరి గింది. మహిళా సంఘాల అధ్యక్షులను కౌన్సిలర్లకు తెలియకుండా ఎలా ఎన్నుకుంటారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. మహిళా సంఘాల అధ్యక్షుల ఎన్నిక అందరి సమక్షంలో జరగాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పి నా కౌన్సిల్‌లో బిల్లులు పెట్టక పోవడంలో ఆంతర్య మేమిటని నిలదీశారు. సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వివిధ అంశాలకు సం బంధించి 14 తీర్మానాలను ప్రవేశపెట్టగా, మార్పులు చేర్పులతో 12 ఆంశాలను కౌన్సిల్‌ ఆమోదిం చింది. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నరసింహుడు,  మిషనర్‌ నర్సయ్య, మునిసిపల్‌ ఇంజనీర్‌ గోపాల్‌, కౌన్సిల్‌ సభ్యులు, కోఆప్షన్‌ సభ్యులు, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T04:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising