ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య కళాశాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలి

ABN, First Publish Date - 2021-09-19T05:18:43+05:30

జోగుళాంబ గద్వాల జిల్లాకు వైద్య కళాశాలను సాధించుకునేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కృషి చేయాల్సిన అ వసరం ఉందని 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాయకుడు మోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 18 : జోగుళాంబ గద్వాల జిల్లాకు వైద్య కళాశాలను సాధించుకునేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు   కృషి చేయాల్సిన అ వసరం ఉందని 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు కోరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యే లు మెడికల్‌ కళాశాల గురించి ప్రస్తావించినట్లు వార్తలు లేకపోవడం జిల్లా ప్రజ ల్లో తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. శనివారం పట్టణంలోని యూనియన్‌ కార్యాల యం వద్ద వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడారు. మంత్రి రాక సందర్భంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు, నిరసనలు తలెత్తకుండా అరెస్టు పర్యం సాగించిన పాలక పార్టీ నాయకులకు మెడికల్‌ కళాశాల సాధన విషయం గుర్తుకు రాకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా మేల్కొని వైద్య కళాశాల కోసం కృషి చేయని పక్షంలో ప్రజల వ్యతిరేకతను చవిచూడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

- ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

 శాసనసభ సమావేశాల్లో జోగుళాంబ గద్వాల జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేలా  గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని స్మృతి వనంలో ప్రజా సంఘాల నాయకులు మధుసూదన్‌బాబు, ఇక్బాల్‌బాషా, ఎండీ సుభాన్‌, వినోద్‌కుమార్‌, కోళ్ల హుసేన్‌, సాయిసవరన్‌, గోపాల్‌యాదవ్‌, దామోదర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం నుంచి వైద్య కళాశాలపై స్పష్టమైన హామీ రాకుంటే రాబోయే రోజుల్లో విద్యార్థులు, మేధావులు, అఖిలపక్షనాయకులు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి సమగ్ర ప్రణాళికతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-09-19T05:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising