ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే

ABN, First Publish Date - 2021-10-30T04:18:58+05:30

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏడేళ్లుగా అధికారంలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తామని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం, వేదికపై జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే అబ్రహాం 

- పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌

అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు  29  : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏడేళ్లుగా అధికారంలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తామని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత, మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌, నాయకులు తిరుమల్‌రెడ్డి, డాక్టర్‌ ఆజయ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ రంగారెడ్డి, బొంకూరు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్రహాం మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీకి సాటి మరే పార్టీ లేదని అన్నారు. ఉద్యమ పార్టీగా అవిర్బవించిన పార్టీ, నేడు ఏన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిందని చెప్పారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ గత రెండేళ్లలో కార్యకర్తలకు, పార్టీకి మధ్య గ్యాప్‌ ఏర్పడిందని, అయినా కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని ఎప్పటికైనా పదవులు వరిస్తాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టికెట్టు వదులు కున్నానని నాయకుడు మందా శ్రీనాథ్‌ అన్నారు. మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌ మాట్లాడుతూ ఆనాడు పార్టీలో లేకపోయినా, పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పారు. మొదట్లో నియోజకవర్గంలో జెండా మోసేవారు కూడా లేకపోతే నేను, నా కొడుకు తిరిగి దాదాపు 40 వేల ఓట్లు సాధించామని గుర్తు చేశారు. తనవల్లే తుమ్మిళ్ల ఎత్తిపోతల, వంద పడకల ఆసుపత్రి మంజూర య్యాయని తెలిపారు. దానికి కొనసాగింపుగా ఎమ్మెల్యే అబ్రహాం ఆసుపత్రికి శంకుస్థాపన చేయించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే అబ్రహాంలపై ప్రతిపక్ష నాయకులు అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని నాయకుడు డాక్టర్‌ అజయ్‌ అన్నారు. ప్రజల కోసం పాటు పడేవాడే అసలైన నాయకుడని ఉత్తనూరు తిరుమల్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్లు కరుణశ్రీ, మనోనమ, దేవన్న, మార్కెట్‌యార్డు చైర్మన్‌ రాందేవ్‌రెడ్డి, నాయకులు కలుగొట్ల తేజ, ఎంపీపీ బీసమ్మ, శ్రీనాథ్‌రెడ్డి, హనుమంతురెడ్డి, జల్లాపూర్‌ వెంకటేశ్వర్లు, బైరాపురం రమణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-30T04:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising