ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ ట్యాంక్‌ బండ్‌గాకొండారెడ్డిపల్లి చెరువు

ABN, First Publish Date - 2021-10-29T05:38:15+05:30

ఎంతో కాలంగా నిరాధరణకు గురైన నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరు వుకు మహర్దశ లభించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి చొరవతో రూ.4 కోట్ల నిధులు మంజూరు

త్వరలో టెండర్ల ప్రక్రియ

కొండారెడ్డిపల్లి చెరువుకు మహర్దశ 

నారాయణపేట, అక్టోబరు 28 : ఎంతో కాలంగా నిరాధరణకు గురైన నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరు వుకు మహర్దశ లభించనుంది. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి చొరవతో కొండారెడ్డి పల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలనే ఉదేశంతో రూ.4 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఇది వరకే ఎమ్మెల్యే సూచనల మేరకు మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె అనసూయ చంద్రకాంత్‌, మునిసిపల్‌ అధికార యంత్రాంగం కొండా రెడ్డి పల్లి చెరువు అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు అవ సరమున్నట్లు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో తాజాగా రూ.4 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరి చేయడంతో చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్ది పర్యాటకులకు అందుబాటులో ఉండేలా చూడాలని మునిసిపల్‌ పాలక అధికార యంత్రాంగం సంకల్పించింది. 

చెరువు కట్ట మరమ్మతులతో ఆఽధునీకరించ డం. 

కొండారెడ్డి పల్లి చెరువు వరకు సీసీ రోడ్డును వేయడం.

విద్యుత్‌ దీపాలంకరణలతో చెరువుకు వెలుగులు నింపడం.

వినాయక, బతుకమ్మ నిమజ్జన ఘాట్‌లను చెరువులో ఏర్పాటు చేయడం.

పార్కుతో ఆహ్లాదకర పచ్చదనాన్ని పెంపొందించి చిన్నారులకు ఆట వస్తువులను సమకూర్చడం. 


Updated Date - 2021-10-29T05:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising