ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-06-22T05:09:14+05:30

సీజనల్‌ వ్యాధులను నివారించడానికి అధికారులు తగు చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 

వనపర్తి అర్బన్‌, జూన్‌ 21: సీజనల్‌ వ్యాధులను నివారించడానికి అధికారులు తగు చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశం హాలులో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కార్యక్రమంపై జిల్లాలోని అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో కీటక జనిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. గ్రామాలలో మురుగునీటి గుంతులు  పూ డ్చి వేయాలని, ట్యాంకులను నీటిని క్లోరినేషన్‌ చేసి సరఫరా చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖకు సూ చించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించి మ లేరియా, డెంగీ, చికున్‌గునియా, వైరల్‌ ఫీవర్‌ వ్యాధులకు సంబంధించిన అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  రెఫర్‌ చేసి తగిన వైద్యం అందించాలని ఆదేశించా రు. వర్షాకాలంలో నీరు కలుషితం కావడం వలన టైఫాయిడ్‌, డైఏరియా, వైరల్‌ ఫీవర్‌ వ్యాధులు వ చ్చే అవకాశం ఉన్నందున మంచినీరు సరఫరా చేసే పైప్‌లు లీకేజ్‌ కాకుండా చూడాలన్నారు.  నీటిని కాచి వడపోసి తాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రా మంలో సబ్‌ సెంటర్‌, అంగన్‌వాడీ, పంచాయతీ ఆఫీస్‌, స్కూల్స్‌, గ్రామంలో పరిసరాలు శుభ్రంగా ఉండేవిధంగా అధికారులు చూడాలని తెలిపారు. స్వయం సహాయక గ్రూపు సభ్యులకు, మహిళా సంఘం సభ్యులకు కీటక జనిత వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని అందులో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనేటట్లు చూడాలని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలలో గల గ్రామాలను ప ర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయిల్‌ బాల్స్‌ తయా రు చేయించి మురికి గుంటలో వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీఎంహెచ్‌వో చందూనాయక్‌,  వైద్యు లు రవిశంకర్‌, రామానుజన్‌,  శ్రీనివాసులు, కమిష నర్‌ మహేశ్వర్‌రెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising