ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలు ఎండకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-10-24T05:13:11+05:30

భీమా, జూరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే పంటలు ఎండకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీపనగండ్ల, అక్టోబరు 23: భీమా, జూరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే పంటలు ఎండకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని కల్వరాలలో భీమా, జూరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భీమా, జూరాల కింద చివరి ఆయ కట్టుకు సాగునీరు అందడం లేదని రైతులకు ఆందోళన చెందుతున్నారని, కాల్వల వెంట పర్యవేక్షణ చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు ఇవ్వాలన్నారు. నీరు ముందుకు వెళ్లకుండా ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. కాల్వలో సీల్టు ఉంటే ఎక్స్‌కవేటర్లతో తొలగిం చాలన్నారు. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌లో నీటి సామర్థ్యం తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. అనంతరం గ్రామంలో కల్వరాల జడ్పీహెచ్‌ఎస్‌లో ఎమ్మెల్యే తన సొంత ఖర్చు లతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ బోర్డును ప్రారంభించారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఎమ్మెల్యేను సన్మానించారు. అలాగూ శ్రీ కృష్ణయాదవ్‌ భవనానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో  ఎంఈవో లక్ష్మణ్‌నాయక్‌, కాంప్లెక్స్‌ పా ఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్య క్షుడు ఎత్తం కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సత్య నారాయణగౌడ్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising