పీయూలో వర్షపునీటి సద్వినియోగానికి చర్యలు
ABN, First Publish Date - 2021-07-10T04:55:37+05:30
పాలమూరు యూనివర్శిటీలో, అనుబంధ పీజీ కాలేజీల్లో వర్షపునీటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నట్లు యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు.
- వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్
పాలమూరు యూనివర్శిటీ, జూలై 9 : పాలమూరు యూనివర్శిటీలో, అనుబంధ పీజీ కాలేజీల్లో వర్షపునీటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నట్లు యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. క్యాచ్ ది రైన్ కార్యక్రమ ప్రచారంలో భాగంగా యూనివర్శిటీ వీసీలతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్ మాట్లాడారు. యూనివర్శిటీలో డీసిల్టింగ్ ద్వారా మూడు పెద్ద బావులను పునరుద్ధరించామని తెలిపారు. మూడు సహజసిద్ధమైన చెరువుల కట్టలు బలోపేతం చేశామన్నారు. 171 ఎకరాల్లోని క్యాంపస్‌లో 70శాతంపైగా సహజసిద్ధంగా ఆకుపచ్చవాతావరణం కలిగి ఉందని, ఇక్కడున్న మొక్కలకు ఇక్కడ కురిసేవర్షపు నీరందేలా ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలో రెయిన్ హార్వెస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రతి వర్షపు నీటిబొట్టుని సద్వినియోగం చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. వర్షపునీటి సద్వినియోగంపై యూనివర్శిటీ పరిధిలోని అన్ని కాలేజీల అధ్యాపకులు, విద్యార్ధులు, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలకు అవగాహన పెంచుతామని వివరించారు.
Updated Date - 2021-07-10T04:55:37+05:30 IST