ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి’

ABN, First Publish Date - 2021-11-30T04:57:17+05:30

ప్రభుత్వ వ్యతి రేక విధానాలపై మంగళవారం నుంచి జిల్లాలో నిర సన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్య క్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞరెడ్డి తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న రాజవర్ధన్‌రెడ్డి, అనుజ్ఞరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి అర్బన్‌, నవంబరు 29 : ప్రభుత్వ వ్యతి రేక విధానాలపై మంగళవారం నుంచి జిల్లాలో నిర సన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్య క్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని మంగళవా రం జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో పెట్రోల్‌బంక్‌ల ముందు నిరసన కార్యక్ర మం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వరి రైతుల సమస్యలు, పోడు భూముల సమస్యలు, దళితుల సమస్యలపై డిసెం బర్‌ 6వరకు వరుసగా బీజేవైఎం, మహిళామోర్చా, గిరిజన మోర్చా, దళిత మోర్చాల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక సమస్యపై నిరసన కార్యక్రమాలు చేపట్ట నున్నట్లు వివరించారు. ధనిక రాష్ట్రమని చెప్పు కుంటున్న ముఖ్యమంత్రి రూ.నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ర్టాన్ని దివాళా తీశాడని మండిపడ్డారు. దేశంలో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో పాటు, 22రాష్ర్టాల్లో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించారని అన్నారు. కానీ మన రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా తగ్గించ లేదని పేర్కొన్నారు. అదేవిధంగా, వరి కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన ఏర్పాటు చేసి వడ్లు కొను గోలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సమా వేశంలో బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జి భాస్కర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రామన్‌గౌడ్‌, మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి పరుశురాం, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T04:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising