ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపే లక్ష్యంగా కృషి చేద్దాం

ABN, First Publish Date - 2021-03-01T04:45:17+05:30

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నేపథ్యంలో ఆమె గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృతనిశ్చయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ 

కల్వకుర్తి టౌన్‌, ఫిబ్రవరి 28:  మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నేపథ్యంలో ఆమె గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృతనిశ్చయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ రాములు,  ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. కల్వకుర్తిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేసీఆర్‌ ప్రవేశపె ట్టిన ప్రజా సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు చేసేందుకు గ్రాడ్యుయేట్స్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నా యకులు టీఆర్‌ఎస్‌ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దాన్ని తిప్పికొట్ట డంలో కార్యకర్తలు ఎప్పటికప్పుడు చురుగ్గా వ్యవహరించాలని తెలిపారు.  నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీసింగ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, జడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌, కల్వకుర్తి  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వట్టెపు బాలయ్య, వైస్‌ చైర్మన్‌ సింగం విజయ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


 సంత్‌సేవాలాల్‌ సేవలు మరువలేనివి

 గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌సేవాలాల్‌ కేవలం గిరిజనులకే కాదని, స మాజంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శమూర్తి అని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తెలి పారు. కల్వకుర్తిలో సంత్‌సేవాలాల్‌ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవాలాల్‌ ఆశయ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్‌ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, రాజకీయంగా గిరిజనులు అత్యు న్నత స్థానాలకు చేరేందుకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఎంపీ రా ములు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీసింగ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ స త్యం, వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, జడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-01T04:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising