సీఎం అయ్యేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి
ABN, First Publish Date - 2021-01-23T03:45:02+05:30
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు మంత్రి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం అన్నారు.
గద్వాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు మంత్రి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం అన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యావం తుడైన కేటీఆర్ సీఎం కావాలని ఎమ్మెల్యేలు, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు కేటీఆర్ అలోచనలు తోడైతే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందన్నారు. ఫిబ్రవరి 18న కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారంపై స్పందించిన ఎమ్మెల్యే ఇది టీఆర్‌ఎస్ అంతర్గత విషయమన్నారు. అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద రూ.36.73 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం వెల్లడించారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో అలంపూర్ దేవాలయ చైర్మన్ ఇ.రవిప్రకాష్ గౌడ్, విష్ణువర్థన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు.
Updated Date - 2021-01-23T03:45:02+05:30 IST