ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2021-01-25T03:36:24+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరపు గణ తంత్ర దినోత్సవ వేడుకలను పూర్తిగా కోవిడ్‌ నిబం ధనలను అనుసరిస్తూ జల్లా పోలీస్‌ పరేడ్‌ గౌండ్‌ లో నిర్వహిస్తామని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఓ ప్ర కటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరపు గణతంత్ర దినోత్సవ వేడుకలను పూర్తిగా కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ జల్లా పోలీస్‌ పరేడ్‌ గౌండ్‌లో నిర్వహిస్తామని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్పవం సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బాలల సాంస్కృతిక కార్యక్రమాల తోపాటు అన్ని సంక్షేమ శాఖలు వ్యవసాయ, పశు సంవర్ధక, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన తదితర శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శా ఖాధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు నిర్వహించాల్సిన విధుల్లో ఎలాంటి పొర పాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా శాఖాధికారులదేనని కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-25T03:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising