ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుతోనే బీసీలకు న్యాయం

ABN, First Publish Date - 2021-08-26T04:19:41+05:30

పరిపాలనలో అన్నివర్గాల వారికి సమాన ప్రాతి నిథ్యం ఉన్నప్పుడే సామాజిక సమానతలు సాధ్యమని ఉస్మానియా విశ్వవిద్యా లయ ప్రొఫెసర్‌ సింహాద్రి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఓయూ ప్రొఫెసర్‌ సింహాద్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఓయూ ప్రొఫెసర్‌ సింహాద్రి 8 మండల్‌ చిత్రపటానికి నివాళి

గద్వాల టౌన్‌, ఆగస్టు 25 :  పరిపాలనలో అన్నివర్గాల వారికి సమాన ప్రాతి నిథ్యం ఉన్నప్పుడే సామాజిక సమానతలు సాధ్యమని ఉస్మానియా విశ్వవిద్యా లయ ప్రొఫెసర్‌ సింహాద్రి అన్నారు. జనాభాలో ఆరవైశాతం పైగా ఉన్న బీసీలకు పాలనలో, విద్య, ఉగ్యోగ, ఉపాధి అవకాశాల్లో తగిన వాటా దక్కకపోవడం శోచనీ యమన్నారు. దీని అధికమించేందుకు నాలుగు దశాబ్దాల క్రితమే మండల్‌ కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి అందజేసిందన్నారు. బుధవారం పట్టణంలోని టీఎస్జీవో భవనంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌  బిందేశ్వర్‌ ప్రసాద్‌ మండల్‌ 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దివంగత నాయకుడి చిత్రపటానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన సింహాద్రి మాట్లాడుతూ పార్లమెంట్‌, రాష్ర్టాల శాసన సభల్లో బీసీలకు సరైన ప్రాతినిథ్యం లేదని, న్యాయవ్యవస్థలోనూ బీసీలకు సముచి త స్థానం దక్కలేదని గణాంకాలతో సహా వివరించారు. జనాభాలో ఐదుశాతం మించని అగ్రవర్ణాలే అన్ని రంగాల్లో ఆధిపత్యం వహిస్తుండగా పబ్లిక్‌ రంగ సంస్థల న్నింటినీ వరుసగా ప్రైవేటుపరం చేస్తూ, కనీసం వీటిలోనైనా బీసీలకు అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేయడం గర్హనీయమన్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ మనుగడను కాపాడుకునేందుకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్‌ బాబు, ఆలూరు ప్రకాష్‌గౌడ్‌, వాల్మీకి, వినోద్‌కుమార్‌, కోళ్ల హుసేన్‌, సిద్ధార్థ కృష్ణ, బీ.కే. వెంకటేష్‌, శ్రీధర్‌, అతికూర్‌ రహెమాన్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-26T04:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising