Telangana: జూరాల ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత
ABN, First Publish Date - 2021-07-22T15:07:25+05:30
జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.750 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 6.325 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 58,600 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 68,422 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దిగువకు శ్రీశైలం వైపు 66,090 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Updated Date - 2021-07-22T15:07:25+05:30 IST