ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాకే కేంద్ర బింధువుగా జడ్చర్ల

ABN, First Publish Date - 2021-12-05T04:47:42+05:30

ఉమ్మడి జిల్లాకే కేంద్ర బిందువుగా ఉన్న జడ్చర్ల పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మా రెడ్డి అన్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో 108 అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి 


జడ్చర్ల, డిసెంబరు 4 : ఉమ్మడి జిల్లాకే కేంద్ర బిందువుగా ఉన్న జడ్చర్ల పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మా రెడ్డి అన్నారు. తెలంగాణ స్టోన్‌ క్రషర్‌ అసోసియేషన్‌ సహకారంతో జడ్చర్ల మండలానికి కేటాయించిన 108 అంబులెన్స్‌ను టీఎస్‌సీఏ అధ్యక్షుడు కమలాకర్‌ రెడ్డితో కలిసి జడ్చర్ల క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. అనం తరం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.35లక్షల చెక్కులు, ఎల్‌వోసీలను లబ్ధిదారులకు అందజేశారు. జడ్చర్ల పట్టణాన్ని ఇప్పటికే సుందరీ కరణ చేశామన్నారు. అనంతరం స్థానిక నేతాజీచౌరస్తాలో మాజీ సీఎం రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్థికశాఖ మంత్రిగా 17 పర్యాయాలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని ఎమ్మెల్యే కొనియాడారు. జడ్చర్ల మున్సిపాలిటీ పాతబజారు సమీపంలోని అలీం, కలీంషా దర్గా ఉర్సు ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జడ్చర్ల మునిసిపాలిటీలోని బాబీస్ట్రీట్‌లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెలే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జడ్పీవైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీరవీందర్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T04:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising