ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణమ్మను దాటిన జములమ్మ

ABN, First Publish Date - 2021-02-25T04:48:56+05:30

పుట్టినింటి నుంచి మెట్టి నింటికి జములమ్మ చేరుకుంది.

గుర్రంగడ్డ నుంచి అమ్మవారిని తీసుకొస్తున్న ఎద్దుల బండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పుట్టింటి నుంచి మెట్టినింటికి చేరిన అమ్మవారు

- ఊరూరా హారతులు పట్టిన భక్తులు

- జమ్మిచేడులో అలరించిన కళాకారుల ప్రదర్శనలు

- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి


గద్వాల రూరల్‌, ఫిబ్రవరి 24 : పుట్టినింటి నుంచి మెట్టి నింటికి జములమ్మ చేరుకుంది. తన తల్లి గారి గ్రామమైన గుర్రంగడ్డ నుంచి బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా జ మ్మిచేడులోని మెట్టినింటికి వచ్చింది. అమ్మవారిని తీసుకురా వడానికి మంగళవారం సారెతో ఎద్దుల బండి వెళ్లగా, సా యంత్రానికి గుర్రంగడ్డకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజ లు నిర్వహించిన అనంతరం, రాత్రి జములమ్మను కృష్ణాన దిలో బోటు ద్వారా ఒడ్డుకు తీసుకొచ్చారు. అక్కడ ఎద్దుల బండిపైన అమ్మవారిని కూర్చోబెట్టి బీరోలు, లత్తీపురం, వెం కటోనిపల్లి మీదుగా జమ్మిచేడుకు చేర్చారు. అక్కడి నుంచి ఆలయం వరకు అమ్మవారి ఆహ్వానానికి పెద్దఎత్తున ఏర్పా ట్లు చేశారు.


హైదరాబాద్‌కు చెందిన కళాకారులు బేతాల, శి వసత్తులు, పోతురాజుల వేషధారణలో ప్రదర్శనలు ఇచ్చా రు. జమ్మిచేడుకు చెందిన చిన్నారులు కోలాటాలు, నృత్య ప్ర దర్శనలు ఇచ్చారు. అమ్మవారు ఆలయానికి చేరిన తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీపీ ఆల్వాల్‌ ప్రతాప్‌ గౌడ్‌, రైతుబంధు చైర్మన్‌ చెన్నయ్య, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ ఎద్దుల బండికి ఆహ్వానం పలికి, జములమ్మను ఆలయంలోకి చేర్చారు. ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆల య చైర్మన్‌ సతీష్‌కుమార్‌, ఈవో వీరేశం శాలువాలతో స త్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, అమ్మవారి ఆహ్వానానికి చేసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే సంతృప్తిని వ్వక్తం చేస్తూ, ఆలయ చైర్మన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.



Updated Date - 2021-02-25T04:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising