ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర రహదారి అధ్వానం

ABN, First Publish Date - 2021-07-21T04:52:47+05:30

తెలంగాణ - కర్ణాటకతో పాటు అంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది.

అంతర్రాష్ట్ర రహదారిపై గుంతల్లో నిలిచిన వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మిట్టదొడ్డి నుంచి బల్గెర వరకు గుంతల మయమైన రోడ్డు

- రోడ్డు నిర్మాణానికి 2018లోనే పూర్తయిన టెండర్ల ప్రక్రియ 

గట్టు, జూలై 20 : తెలంగాణ - కర్ణాటకతో పాటు అంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. నిత్యం వందల వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై అడుగడుగునా గుంతలు పడి వర్షం నీటితో బురదమయంగా మారింది. గట్టు మండలంలోని మిట్టదొడ్డి స్టేజీ నుంచి కర్ణాటక సరిహద్దులోని కొత్తదొడ్డి శివారు వరకు 11 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంది. అందులో మిట్టదొడ్డి నుంచి బల్గెర వరకు ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతిని  ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి 2018 లోనే రు.10 కోట్లు మంజూర య్యాయి. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం బల్గెర చెక్‌ పోస్టు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. అందులో రెండు  కిలోమీటర్ల మేర బీటీ వేయడం కూడా పూర్తయ్యింది. కర్నూల్‌, అయిజ, అలంపూర్‌, శాంతినగర్‌, రాయచూర్‌, గట్టు, మాచర్లతో పాటు  చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ రహదారి మీదుగానే రాకపోకలు కొనసాగించా ల్సి ఉంది. ఏడు కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యని వాహనదారులు చెప్తున్నారు. కనీసం తాత్కా లిక మరమ్మతులైనా చేపట్టాలని కోరుతున్నారు. 


తాత్కాలిక మరమ్మతులు చేపడతాం

రహదారి దెబ్బతిన్న విషయంపై రోడ్లు భవనాల శాఖ ఇన్‌చార్జి ఏఈ మహేశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరింది. ప్రస్తుతం నాలుగు కిలోమీటర్ల వరకు  రోడ్లు పనులు తుది దశకు వచ్చాయని తెలిపారు. అవి పూర్తయ్యాక మిగతా పనిమీద దృష్టి సారిస్తామన్నారు. వర్షం నీరు పోయిన తర్వాత గుంతలను మట్టితో పూడ్చి తాత్కాలికంగా మరమ్మతు చేయిస్తామని తెలిపారు. త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.


Updated Date - 2021-07-21T04:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising