ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంచి ఉన్న ప్రమాదం

ABN, First Publish Date - 2021-03-04T04:47:06+05:30

పట్టణంలోని గంజిపే టలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రభుత్వ పాఠశాల పూర్తి శిథిలావస్థకు చేరింది.

గంజిపేటలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల 

- పెచ్చులూడిన పైకప్పు

- ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు 

- పునర్నిర్మించాలంటున్న స్థానికులు 

గద్వాల టౌన్‌, మార్చి 3 : పట్టణంలోని గంజిపే టలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రభుత్వ పాఠశాల పూర్తి శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోననే భయం విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల భవనం మరింత శిథిలమైంది.  ఈ పాఠశాల దుస్థితి గురించి పలు పత్రికల్లో కథనాలు వచ్చినా అధి కారులు స్పందించడం లేదని  స్థానికులు ఆరో పిస్తున్నారు. ఈయే డు కరోనా నేప థ్యంలో ప్రభు త్వ పాఠశాల లు నిర్వహిం చకపోవడంతో  ఎవరూ దానిపై దృష్టి సారించలే కపోగా ఇటీవలే తిరి గి రాష్ట్ర ప్రభు త్వం 6,7,8,తరగతుల నిర్వహణకు అనుమతించింది. ఈ క్రమంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శిథిలావస్థలో ఉన్న గదుల్లో నిర్వహి స్తుండడంతో విద్యార్థులు జంకుతున్నారు. ఇప్పటికే పైకప్పు పెచ్చులూడింది. గోడలకు నిమ్ము ఉండడం తో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పం పేందుకు ఇష్టపడడం లేదని స్థానికులు అంటు న్నారు. ఈ క్రమంలో భవనాన్ని పూర్తిగా కూలద్రోసి పునర్మిర్మించాలని, అంతవరకు విద్యార్థుల కోసం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తల్లి దండ్రులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని తాము  ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లామని కౌన్సిలర్‌ బంగి ప్రియాంక సుదర్శన్‌ తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రమాదం జరుగక ముందే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  





Updated Date - 2021-03-04T04:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising