ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ నిర్మాణాలకు జరిమానా వేయాలి

ABN, First Publish Date - 2021-05-11T04:17:36+05:30

మునిసిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు గర్తించి తొలగించడం, వాటికి వందశాతం జరిమానా వేయడం మునిసిపల్‌ కమిషనర్‌లదే బాధ్యత అని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మనూచౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ మనూచౌదరి


నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, మే 10: మునిసిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు గర్తించి తొలగించడం, వాటికి వందశాతం జరిమానా వేయడం మునిసిపల్‌ కమిషనర్‌లదే బాధ్యత అని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని నాలుగు మునిసిపా లిటీ కమిషనర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మునిసిపాలిటీలో ఇప్పటికే ఎన్‌పోర్స్‌ మెంటు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బృందంలో ఒక రెవెన్యూ అధికారి, పోలీసు, ఫైర్‌, ఆర్‌ఆండ్‌ బీ అధికారులను నియమించామని తె లిపారు. ఎవరైనా సరైన నిర్మాణానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 75చదరపు గజాల వరకు అనుమతి అవసరం లేదని, కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలన్నారు. అంత కంటే ఎక్కువ స్థలం నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని అందుకు 21రోజుల వరకు అనుమతి ఇస్తామన్నారు. అనుమతికి అనుగుణంగా నిర్మాణాలు చేప ట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి నారనే అంశాన్ని పరిశీలించాల్సిన బాధ్యత టౌన్‌ ప్లానింగ్‌ వాళ్లదేనన్నారు. ఒక్క సారి పరిశీలించిన అనంతరం మునిసిపల్‌ కమిషనర్లకు నివేదించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని నిర్మాణాలను విచారణ కోసం ఎన్‌పోర్స్‌ మెంటు టీంను ఆదేశించాల్సిం చాలా వద్దనే బాధ్యత మునిపిపల్‌ కమిషనర్లపై ఉంటుందన్నారు. విచారణ అనంతరం జరిమానా వేసే నిర్ణయం మునిపిపల్‌ కమిష నర్లపై ఉంటుందన్నారు. మునిపిపల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల విచారణ పరిష్కారం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కమిషనర్లు అన్వేష్‌, జాకీర్‌ అహ్మద్‌, శ్రీహరిరాజు, విక్రమ్‌సింహా రెడ్డి, ఏఎస్‌ఐలు, ఫైర్‌ డిపార్టుమెంటు సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-11T04:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising