ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌

ABN, First Publish Date - 2021-07-30T04:34:47+05:30

ప్రయాణికురాలు తన బ్యాగును ఆటోలోనే మరిచి పోగా, ఆ బ్యాగును పోలీసుల సమక్షంలో సదరు ప్రయాణికురాలికి అందజేసి జడ్చర్లకు చెందిన ఆటో డ్రైవర్‌ కోడిపర్తి ఆంజనేయులు నిజాయితీని చాటుకున్నాడు.

పోలీసుల సమక్షంలో మహిళకు బ్యాగును అందజేస్తున్న ఆటో డ్రైవర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగున్నర తులాల బంగారం, 10తులాల వెండి ఆభరణాలు అందజేత

జడ్చర్ల, జూలై 29 : ప్రయాణికురాలు తన బ్యాగును ఆటోలోనే మరిచి పోగా, ఆ బ్యాగును పోలీసుల సమక్షంలో సదరు ప్రయాణికురాలికి అందజేసి జడ్చర్లకు చెందిన ఆటో డ్రైవర్‌ కోడిపర్తి ఆంజనేయులు నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం లింగంపేటలో ఓ శుభకార్యానికి హైదరాబాద్‌కు చెందిన పరమేశ్వరి జడ్చర్లకు వచ్చింది. లింగంపేటకు వెళ్లేందుకు కోడిపర్తి ఆంజనేయులు ఆటో ఎక్కింది. అనంతరం నాలుగున్నర తులాల బంగారు ఆభరణం, 10తులాల వెండి ఆభరణాలున్న బ్యాగును ఆటోలోనే మరిచి దిగి వెళ్లిపోయింది. ఆటోలో ఎవరో ప్రయాణికురాలు బ్యాగు మరిచిపోయిందని భావించి, వెంటనే జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఆటోలో బ్యాగును మరిచిపోయానంటూ పోలీస్‌స్టేషన్‌కు సదరు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. దీంతో పూర్తి విచారణ చేపట్టారు. సదరు మహిళ పరమేశ్వరికి బ్యాగును జడ్చర్ల సీఐ వీరస్వామి, ఎస్‌ఐలు శంషొద్దీన్‌, అభిషేక్‌రెడ్డి, ఏఎస్‌ఐ ప్రిస్కిల్లా, ఆటో డ్రైవర్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌హజీల సమక్షంలో అప్పగించాడు. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్‌కు ప్రోత్సాహకంగా సీఐ వీరస్వామి రూ.1000 అందజేశారు. 

Updated Date - 2021-07-30T04:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising