ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం ఇప్పిస్తానని వేధింపులు

ABN, First Publish Date - 2021-04-16T05:15:53+05:30

ఉద్యోగం ఇప్పిస్తాననే సాకుతో తరచూ మహిళలను వేధి స్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జోగుళాంబ గద్వాల పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలి పారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల క్రైం, ఏప్రిల్‌ 15 : ఉద్యోగం ఇప్పిస్తాననే సాకుతో తరచూ మహిళలను వేధి స్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జోగుళాంబ గద్వాల పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలి పారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో గురువా రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సికిం ద్రాబాద్‌కు చెందిన కోదండ విభేష అలియాస్‌ విభీషన్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ అనే వ్యక్తి రెండేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు గా పని చేసే వాడు. అక్కడ నర్సు ట్రైనింగ్‌లో ఉన్న మహిళల ఫోన్‌ నంబర్లు సేకరిం చాడు. అక్కడ పని మానేసి, ఓ ప్రయివేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరాడు. ట్రైనింగ్‌లో ఉన్న నర్సులకు ఫోన్లు చేసి, వారి స్నేహితుల ఫోన్‌ నం బర్లు సేకరించాడు. అనంతరం ట్రైనింగ్‌లో ఉన్న నర్సులకు, వారి స్నేహితులకు ఫో న్లు చేసి వేధించడం మొదలు పెట్టాడు. ఏఎన్‌ఎం పోస్టులు ఇప్పిస్తానని చెబుతూ, తన కోరిక తీర్చాలని అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై నల్గొండ, జగిత్యాల జిల్లా ల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. గత నెల 10న గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఫోన్‌ చేసి తన కోరిక తీర్చమని వేధించాడు. దీంతో ఆ మె పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువా రం విశ్వనాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2021-04-16T05:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising