ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొల్లాపూర్‌ మామిడికి మంచి రోజులు

ABN, First Publish Date - 2021-10-06T04:07:45+05:30

ప్రపంచ వ్యాప్తంగా జీఐ ట్యాగ్‌తో గుర్తింపు పొందిన కాకినాడ కాజా, అరకు కాఫీ, ఆగ్రా కేతా మిఠాయి లిస్టులో త్వరలోనే కొల్లాపూర్‌ మామిడి చేరే అవకాశముంది.

బేనీషాన్‌ రకం మామిడి(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఐ గుర్తింపు రేసులో ఫలం

గుర్తింపు లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ

ఇప్పటికే ప్రఖ్యాతి గాంచిన బేనీషా రకం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 32,215 ఎకరాల్లో మామిడి తోటలు


కొల్లాపూర్‌, అక్టోబరు 5: ప్రపంచ వ్యాప్తంగా జీఐ ట్యాగ్‌తో గుర్తింపు పొందిన కాకినాడ కాజా, అరకు కాఫీ, ఆగ్రా కేతా మిఠాయి లిస్టులో త్వరలోనే కొల్లాపూర్‌ మామిడి చేరే అవకాశముంది. అందుకోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొల్లాపూర్‌ మామిడికి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి భూ సాయిల్‌, నేల స్వభావం, భౌగోళిక పరిస్థితులు, పూత దశలో ఇక్కడి వాతావరణ మార్పులు అనుకూలించడంతో మార్చి మొదటి వారంలోనే పండు వస్తుంది. తీపి, అత్యధిక దిగుబడి, సైజు, మంచి క్వాలిటీతో కొల్లాపూర్‌ మామిడి బేనీషా రకానికి జీఐ సూచిక(జియో గ్రాఫికల్‌ ఇండికేషన్‌) కోసం భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్‌కి దరఖాస్తు చేయాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ఇప్పటికే వివరాల సేకరణ ప్రారంభించింది.


సురభి రాజుల కాలం నుంచే..

నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 32,215 ఎకరాల్లో 12,549 మంది రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ప్రత్యేక గుణాలు, తీయని రుచి కలిగిన కొల్లాపూర్‌ మామిడికి దాదాపు 300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. సురభి రాజుల కాలంలోనే ఈ నేల భౌగోళిక వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, మామిడి తోటల సాగుకు బీజం వేశారు. నాటి నుంచి నేటి వరకు మధుర ఫలం మామిడి తీపిలో ఎలాంటి తేడా లేకుండా కొల్లాపూర్‌ మామిడి గుర్తింపు పొందింది. జీఐ సూచికతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ బ్రాండ్‌తో కొల్లాపూర్‌ మామిడి అమ్మకాలు జోరందుకోనున్నాయి. ఇదే జరిగితే మామిడి రైతులకు ఆదాయం రెట్టింపు కావడం ఖాయం.


కొల్లాపూర్‌ మామిడి ప్రత్యేక గుర్తింపు 

ఉమ్మడి పాల మూరు జిల్లాలోనే కొల్లాపూర్‌ నియోజ కవర్గంలో మామిడి తోటలు అత్యధికం గా ఉన్నాయి. ఇక్కడి నేల స్వభావం, భౌ గోళిక వాతావరణ పరిస్థితులు మామిడి రైతులకు అనుకూ లిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలికాపు కొల్లాపూర్‌ మామిడి రైతుల నుంచే వస్తుంది. జీఐ ట్యాగ్‌ కేటాయిస్తే ఈ ప్రాంత మామిడి రైతులకు మేలు కలుగుతుంది.

- హార్టికల్చర్‌ అధికారి, లక్ష్మణ్‌

Updated Date - 2021-10-06T04:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising