ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా.. సులభంగా

ABN, First Publish Date - 2021-10-30T04:19:34+05:30

ఏడాది కాలంలో ‘ధరణి’ వెబ్‌సైట్‌ ద్వారా అనేక అద్భుత ఫలితాలు సాధించామని, పారదర్శకతకు, వే గానికి, సులభంగా పనులు జరగడానికి ‘ధరణి’ ప్రజ లకు చాలా ఉపయోగకరంగా మారిందని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు.

‘ధరణి’ వెబ్‌సైట్‌ ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కేక్‌కట్‌ చేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, వనపర్తి):

ఏడాది కాలంలో ‘ధరణి’ వెబ్‌సైట్‌ ద్వారా అనేక అద్భుత ఫలితాలు సాధించామని, పారదర్శకతకు, వే గానికి, సులభంగా పనులు జరగడానికి ‘ధరణి’ ప్రజ లకు చాలా ఉపయోగకరంగా మారిందని  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు. ‘ధరణి’ వెబ్‌సైట్‌ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కలెక్టరే ట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె కేక్‌కట్‌ చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ పరిపాలనలో రికార్డులను తారుమారు చేసే అవకా శం లేకుండా చేయడం, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకో వడానికి వీలు లేకుండా చేయడం వంటివి ‘ధరణి’ ప్రారంభానికి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. స్లాట్‌ బుక్‌ చేసుకుని.. ఆ తేదీ రోజు వస్తే కేవలం అరగం టలో అన్ని పనులు అయిపోతున్నాయని తెలిపారు. సురక్షిత, అవాంతరాలు లేని, విచక్షణ రహిత సేవల ను ‘ధరణి’ ద్వారా పొందగలుగుతున్నారని తెలిపారు. గతంలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు-2 ఉంటే.. ఇ ప్పుడు అవి 14కు పెరిగాయని అన్నారు. ‘ధరణి’లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, ప్రజల అవాంత రాలు దూరం చేయడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోందని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం 31 మాడ్యూల్స్‌ ఉన్నాయని, సమాచారం కోసం 10 మా డ్యూల్స్‌ ఉన్నాయని తెలిపారు. జిల్లా పరిధిలోని జా యింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఇప్పటివరకు 28061 లావాదేవీలు పూర్తయ్యాయని, అందులో 20103 లావాదేవీలు అమ్మకం లేదా బహుమతి ద్వా రా పూర్తయ్యాయని, విరాసత్‌ ద్వారా 2278 లావా దేవీలు, భాగపరిష్కారం ద్వారా 109 లావాదేవీలు జరిగాయన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10537 ఫిర్యా దులను పరిష్కరించామని, పెండింగ్‌ మ్యూటేషన్‌ 4710, భూమి విషయాలపై ఫిర్యాదులు 4277, నిషేఽ దించబడిన జాబితా కింద 840, కోర్టు కేసు, ఇంటి మేషన్‌ 518 ఫిర్యాదులు పరిష్కరించామని అన్నారు. గ్రామాల వారీగా రికార్డులలో నిషేధిత ఆస్తులుగా త ప్పుగా నమోదు అయిన వాటిని ఒక నెల వ్యవధిలో తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ ను ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. ఈ సమావే శంలో అడిషనల్‌ కలెక్టర్లు వేణుగోపాల్‌, ఆశీష్‌ సంగ్వాన్‌, తహశీల్దార్లు, డీటీలు, కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:19:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising