ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు పంట, భూమి నష్ట పరిహారం ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-07-27T04:14:05+05:30

టీఆర్‌ఎస్‌ నాయకుల అత్యుత్సాహాంతోనే 99వ ప్యాకేజీ కాలువ తెగిపోయి రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని, దీనికి బాధ్యులై న టీఆర్‌ఎస్‌ నాయకులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతో పాటు నష్టపో యిన రైతులకు పంటనష్టంతో పాటు భూమికి పరిహారం చెల్లించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

పంట పొలాలను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే,నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీఆర్‌ఎస్‌ నాయకుల అత్యుత్సాహంతో కోట్లలో నష్టం

- ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌

- తెగిన 99వ ప్యాకేజీ కాల్వను పరిశీలించిన కాంగ్రెస్‌ నాయకులు  

గద్వాల రూరల్‌/ధరూర్‌ జూలై 26: టీఆర్‌ఎస్‌ నాయకుల అత్యుత్సాహాంతోనే 99వ ప్యాకేజీ కాలువ తెగిపోయి రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని, దీనికి బాధ్యులై న టీఆర్‌ఎస్‌ నాయకులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతో పాటు నష్టపో యిన రైతులకు పంటనష్టంతో పాటు భూమికి పరిహారం చెల్లించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ధరూ ర్‌ మండల పరిధిలోని గుడ్డెందొడ్డి  రిజర్వాయర్‌ 99వ ప్యాకేజీ పరిధిలో తెగిన కా ల్వను, పనికిరాకుండా పోయిన పంటపొలాలను కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రఘురామ శర్మను కలిసి అక్కడి రైతుల పరిస్థితిని వివరించారు. అనంతరం విలేకరులతో సపంత్‌కుమార్‌ మాట్లాడారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ పరిధిలోని 99వ ప్యాకేజీ  కాలువ పూర్తికాలేదని, దానికి సామర్థ్యం మేరకు నీటిని వదలాల్సి ఉందన్నారు. కానీ, అనుమతులు లేకపోయినా ఇద్దరు ప్రజాప్రతినిధులు షెటర్లు తెరవడంతోనే భారీ నష్టం వాటిల్లిందన్నారు. రైతుల పొలాల్లో ఇసుకమేటలు వేశాయని వాటిని తొలగించి, భూమిని సాగుకు యోగ్యం గా మార్చుకునేందుకు  రూ. లక్షల్లో ఖర్చు అవుతుందని దానిని ప్రభుత్వమే భ రించాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లో నష్టపరిహారం నిర్ణయిస్తామని అ దనపు కలెక్టర్‌ చెప్పారని, తాము పదిరోజుల సమయం ఇస్తున్నామని, అప్పటికీ నష్టపరిహారం ఇవ్వకపోతే ఆగస్టు 6న రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామ ని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు కట్టించిన ప్రాజెక్టుల వద్ద నీళ్లును వదిలి పూలు చల్లి ఫొటోలకు  టీఆర్‌ఎస్‌ నాయకులు ఫోజులు ఇవ్వడం తప్ప  చేసింది ఏమిలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వెం కటేష్‌, నాయకులు వీరబాబు, నందు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-27T04:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising