ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయం కోసం రైతు దీక్ష

ABN, First Publish Date - 2021-07-30T04:51:48+05:30

న్యాయం కోసం ఓ రైతు, కుటుంబంతో కలిసి గురు వారం తన పొలం వద్దే దీక్ష చేపట్టారు.

పొలంలో దీక్ష చేపట్టిన రైతు బుచ్చమ్మ, కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అధికారుల హామీతో విరమణ

గద్వాల రూరల్‌, జూలై 29 : న్యాయం కోసం ఓ రైతు, కుటుంబంతో కలిసి గురువారం తన పొలం వద్దే దీక్ష చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బుచ్చమ్మకు సర్వే నంబర్‌ 296లో 30 గుంటల భూమి ఉంది. వారి పక్క పొలం రైతు గత ఏడాది తన భూమిని మండల సర్వేయర్‌తో సర్వే చేయించుకున్నాడు. సర్వే లో బుచ్చమ్మకు చెందిన కొంత భూమి పక్క పొలానికి చెందినదని చూపించాడు. దీంతో ఆమె ఆందోళన చెందిన తన అల్లుడు మహే శ్వర్‌రెడ్డితో కలిసి జిల్లా సర్వే కార్యా లయ అధికారులను సంప్రదించారు. దీంతో జిల్లా సర్వే అధికారి ఆశన్న మరోసారి సర్వే చేసి 296కు సంబంధించిన భూమిని గుర్తించి ఇచ్చారు. రెండు సర్వేల్లో హద్దులు తేడా రావడంతో వివాదం మొదలైంది. జిల్లా సర్వేయర్‌ భూమికి హద్దులను చూపించినా, పక్కపొలం వారు వీరిని పొలంలోకి రానివ్వడం లేదు. దీంతో రైతు బుచ్చమ్మ, మేనల్లుడు మహేశ్వర్‌రెడ్డితో పాటు, కుటుంబ సభ్యులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతుతో మాట్లాడారు. ఆర్దీవో రాము లు సర్వేయర్‌లతో మాట్లాడి వివరాలు తెలుసుకొని రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. జాయింట్‌ సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు కుటుంబం దీక్షను విరమించింది. 

Updated Date - 2021-07-30T04:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising