ప్రతీ వ్యక్తి పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి
ABN, First Publish Date - 2021-06-21T03:54:16+05:30
ప్రతీ వ్యక్తి తనపుట్టిన రోజు న ఖచ్చితంగా కొన్ని మొక్కలు నాట డం అలవాటుగా పెట్టుకోవాలని కలె క్టర్ శర్మన్ అన్నారు.
నాగర్‌కర్నూల్, జూన్ 20 (ఆంధ్ర జ్యోతి): ప్రతీ వ్యక్తి తనపుట్టిన రోజు న ఖచ్చితంగా కొన్ని మొక్కలు నాట డం అలవాటుగా పెట్టుకోవాలని కలె క్టర్ శర్మన్ అన్నారు. కలెక్టర్ 59వ పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన పుట్టి న రోజుకు శుభాకాంక్షలు తెలపడాని కి వచ్చిన అధికారులతో మాట్లాడు తూ ప్రతీ ఒక్కరు ప్రతి పుట్టిన రోజు న కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలు ఒక తీపి గుర్తుగా ఉండడమే కాకుండా మొక్కలు తిరిగి మనకు మంచి గాలిని, పళ్లను, పరిసరాలకు అందాన్ని ఇస్తాయని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా కన్వీనర్ రమేష్, కలెక్టర్ సీసీ నారాయణ, గౌతమ్ తదితరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనగా ప్రముఖులు, జిల్లా అధికారులు కలెక్టర్ శర్మన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2021-06-21T03:54:16+05:30 IST