ఏరువాక పౌర్ణమికి ముందే పారిన ఏరు
ABN, First Publish Date - 2021-06-13T04:49:38+05:30
ఏరువాక పౌర్ణమికి ముందే ఈ ఏడాది ఏరు (కృష్ణానది) పారింది.
బీచుపల్లి దగ్గర వరద నీటితో ప్రవహిస్తున్న కృష్ణమ్మ
ఇటిక్యాల జూన్ 12 : ఏరువాక పౌర్ణమికి ముందే ఈ ఏడాది ఏరు (కృష్ణానది) పారింది. నడిగడ్డలో ఏరు ముందా.. ఏరువాక ముందా అనే ఒక నానుడి ఉంది. ఏరువాక పౌర్ణమి పోయినా ఏరు రాకుండేది. ఈ సారి ఊహించని సంఘటన చోటుచేసుకొంది. కృష్ణానదికి ఎగువన కురిసిన వర్షాలకు వరద నీరు రావడంతో జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు శ్రీశైలం వైపు నీరు వదలడంతో బీచుపల్లి దగ్గర గత రెండు రోజుల నుంచి కృష్ణమ్మ ప్రవహిస్తుండడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 16సంవత్సరాల అ నంతరం ఈయేడు పౌర్ణమి రాక ముందే కృష్ణమ్మ ప్రవహిస్తుండడం రైతులు వ్యవసాయ పనులకు పూనుకున్నారు.
Updated Date - 2021-06-13T04:49:38+05:30 IST