ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవ చేయడం అదృష్టంగా భావించాలి

ABN, First Publish Date - 2021-04-24T04:55:03+05:30

ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిం చాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు సిబ్బంది, హోంగార్డులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 23: ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిం చాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు సిబ్బంది, హోంగార్డులకు సూచించారు. కరోనా సమయంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూనే, పోలీసులు తమ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో పోలీసు సిబ్బంది, హోంగార్డులతో ఎస్పీ శుక్ర వారం మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండటం మన అదృష్టమని, టీకా తీసుకోవడం వల్ల మనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ ఇచ్చినవారం అవుతామని అన్నారు. నడక, యోగా అనేవి పోలీసులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ రఫిక్‌, డాక్టర్‌ ఖాజా, ఇన్‌స్పెక్టర్లు సురేశ్‌, శ్రీనివాస్‌, అప్పల నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising