ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగిలో వరి సాగు చేయొద్దు

ABN, First Publish Date - 2021-12-08T04:54:04+05:30

జిల్లాలోని రైతులు యాసంగిలో వరి పంటను వేసుకోవద్దని జిల్లా వ్యవసాయాధికారిణి వై.సుచరిత సూచించారు.

నేరెళ్లపల్లిలో కల్లంలోని ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు అవగాహన కల్పిస్తున్న డీఏఓ వై.సుచరిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత


పాలమూరు, డిసెంబరు 7 : జిల్లాలోని రైతులు యాసంగిలో వరి పంటను వేసుకోవద్దని జిల్లా వ్యవసాయాధికారిణి వై.సుచరిత సూచించారు. మంగళవారం ఆమె జిల్లాలోని బాలానగర్‌ మండలం నేరెళ్లపల్లిలో కల్లంలోని ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, సమస్యలు తెలుసు కున్నారు. వరికి బదులు నూనె గింజలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగలు, జొన్న, పెసర లాంటి పంటలను సాగుచేసుకోవాలన్నారు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, ప్రభుత్వం వరిని కొనదన్నారు. వరినే సాగు చేసుకుందామను కునే రైతులు ఉత్పత్తి, అమ్ముకోవడం సొంతంగానే చూసుకోవాలన్నారు. గతేడాది 1,20,097 హెక్టార్లకు గాను 1,03,400మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనమని తేల్చిచెప్పటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు సూచనలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 


ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన, పోస్టర్‌ విడుదల

చిన్నచింతకుంట : మండలంలోని వడ్డెమాన్‌ గ్రామంలోని రైతువేదిక వద్ద మంగళవారం ప్రత్యా మ్నాయ పంటల సాగుపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా, రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు యాసంగిలో ఏఏ పంటలు సాగు చేయాలన్న దానిపై ప్రభుత్వం రూపొందిం చిన పోస్టర్‌ను అధికారులు రైతులతో కలిసి విడు దల చేశారు. పప్పుదినుసులు, నూనెగింజలు, ఆయిల్‌పాం సాగుపై అధికారులు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, ఏఓ రాజేష్‌ఖన్నా, అప్పంపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-08T04:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising