ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి డబ్బులు ఆలస్యం

ABN, First Publish Date - 2022-01-01T05:08:25+05:30

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డబ్బులు సకాలంలో అందడం లేదని కూలీలు అంటున్నారు. నాలుగైదు నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తున్నారని చెబుతున్నారు.

కొత్తూరు శివారులోని నర్సరీలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

4 నుంచి 5 నెలలకోసారి అందజేత 8 ఇబ్బందుల్లో కూలీలు

100 రోజులు పని దినాలు పూర్తి చేసిన కుటుంబాలు 9,252


భూత్పూరు, డిసెంబరు 31: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డబ్బులు సకాలంలో అందడం లేదని కూలీలు అంటున్నారు. నాలుగైదు నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తున్నారని చెబుతున్నారు. దాంతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని వాపోతున్నారు. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పడం గమనార్హం.


1,46,252 కుటుంబాలకు జాబ్‌ కార్డులు

జిల్లాలోని 14 మండలాల్లో 441 గ్రామ పంచాయితీలు, వాటి పరిధిలో 686 గ్రామాలు ఉన్నాయి. 1,46,252 కుటుంబాలకు జాబ్‌ కార్డులు ఉన్నాయి 2,53,092 మంది కూలీలు 8,184 శ్రమ శక్తి సంఘాలతో కలిసి పనులు చేస్తున్నారు. 2021 సంత్సరానికి 61 కోట్ల 81 లక్షల పని దినాలకు గాను 105 కోట్లా 13 లక్షలా 48 రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రూ.40.87 కోట్ల వ్యయంతో కూలీలకు మెటీరియల్‌ అందించారు. 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబా లు జిల్లా వ్యాప్తంగా 9,252 ఉన్నాయి. కూలీలకు కనీసం వేతనం రోజుకు రూ. 188 నుంచి రూ.242 చెల్లిస్తున్నా రు. 2021 డిసెంబరు నాటికి కూలీలకు మొ త్తం డబ్బులు చెల్లించినట్లు అధికారులు చెబుతుండగా, కూలీలు మాత్రం డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. సకాలంలో ఇవ్వడం లేదని, నాలుగైదు నెలల తర్వాత ఇస్తున్నారని చెబుతున్నారు.


4 నెలల నుంచి డబ్బులు రావడం లేదు

నేను చాలా రోజుల నుంచి ఉపాధి పనులకు వెళ్తున్నా. నాలుగు నెలల నుంచి కూలీ డబ్బులు రావడం లేదు. సారొళ్లను అడిగితే వస్తాయని చెబుతున్నారు. డబ్బులు లేక కుటుంబం గడవడం కష్టంగా ఉంది.

- జమున బాయి, కొత్తూరు పెద్ద తండా


కూలీ పైసలు వస్తలేవు

నేను ఆరు నెలల సంది కూలీ పని చేస్తున్నా. నాకు రావలసిన కూలీ డబ్బులు రావడం లేదు. సారోళ్లను అడిగితే అప్పుడు, ఇప్పుడు అంటున్నారు. పిల్లల సదువులకు పైసలు లేవు. బ్యాంకులలో పోయి చూస్తే డబ్బులు రాలేవని చెబుతున్నారు. ఎవరైనా దయతలిచి డబ్బులు ఇపిస్తే బాగుండేది.

- మన్నిబాయి, కొత్తూరు పెద్ద తండా


కూలీల డబ్బులు ఆగిపోలేదు

జిల్లా ఎక్కడ ఒక్కరూపాయి కూడా కూలీల డబ్బులు ఆగిపోలేదు. ఈ నెల డి సెంబరు వరకు జిల్లా వ్యాప్తంగా కూలీలకు రావలసిన ప్రతి రూపాయి అందించడం జరుగుతుంది. మస్టర్‌ లేటుగా వస్తేనే డబ్బు లు చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. 

- రవికుమార్‌, ఉపాధి హామీ పథకం జిల్లా మేనేజరు

Updated Date - 2022-01-01T05:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising