పత్తికి మద్దతు
ABN, First Publish Date - 2021-10-21T05:38:30+05:30
పత్తికి మద్దతు ధర దక్కు తోంది. ప్రభుత్వం క్వింటాలుకు రూ.6,000గా ధర నిర్ణయించింది. ప్రైవేట్‌లో రూ.6,600 నుంచి రూ.7,700 వరకు కొనుగోలు చేస్తున్నారు.
నారాయణపేట, అక్టోబరు 20: పత్తికి మద్దతు ధర దక్కు తోంది. ప్రభుత్వం క్వింటాలుకు రూ.6,000గా ధర నిర్ణయించింది. ప్రైవేట్‌లో రూ.6,600 నుంచి రూ.7,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్‌లో ధర ఎక్కువగా ఉండటంతో రైతులు అక్కడ విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు. దాంతో నారాయణపేట జిల్లాలోని నాలుగు పత్తి ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాలు వరుస బారులు తీరాయి. పత్తిని విక్రయించేందుకు రైతులు ఒక రోజు ముందుగానే వాహనాలను వరుస క్రమంలో ఉంచుతుండడంతో ఆయా జిన్నింగ్ మిల్లుల వద్ద గల ప్రధాన రోడ్లపై సందడి కనిపిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.
Updated Date - 2021-10-21T05:38:30+05:30 IST