ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయ సేవాసంస్థ కార్యక్రమాలకు సహకారం

ABN, First Publish Date - 2021-07-30T04:56:12+05:30

న్యాయసేవా సంస్థ జిల్లాలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా అధి కార యంత్రాంగం సంపూర్ణ మద్దతు ఉంటుందని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా న్యాయసేవా సంస్థ స్టాట్యుటరీ బాడీ సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు


మహబూబ్‌నగర్‌, జూలై 29 : న్యాయసేవా సంస్థ జిల్లాలో  చేపట్టే కార్యక్రమాలకు జిల్లా అధి కార యంత్రాంగం సంపూర్ణ మద్దతు ఉంటుందని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవా సంస్థ స్టాట్యుటరీ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంస్థ చైర్మన్‌, జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి అధ్యక్షత వహించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా న్యాయసేవా సంస్థ మహిళలు, చిన్నపిల్లలు, ఇతర సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అండగా నిలబడాలని కోరారు. వారికి సంబంధించిన చట్టాలపై అవగా హన కల్పించాలని కోరారు. జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో వివిధ పక్షాలు భాగస్వాములు అవడం వలన కేసుల పరిష్కారంలో మంచి ప్రగతి కనబడు తోందన్నారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖల అఽధికారులు, న్యాయవాదులు, పోలీసులు, కోర్టు డ్యూటీ అధికారుల కృషి ఎనలేనివని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్య దర్శి ఎన్‌, వెంకట్‌రామ్‌, ప్రభుత్వ న్యాయవాది మనోహర్‌, పీపీ బాలగంగాధర్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హన్మంతు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌ పాల్గొన్నారు. 


పార్కింగ్‌ షెడ్‌ పనుల పరిశీలన


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌) : న్యాయవాదులు, జిల్లా కోర్టుకు వచ్చే వారి కోసం వాహనాల పార్కింగ్‌ షెడ్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, జిల్లా జడ్జి ఎస్‌. ప్రేమావతి అన్నారు. గురువారం జిల్లా కోర్టు పక్కన జరుగుతున్న పార్కింగ్‌ షెడ్డు నిర్మాణ పనులను వారు పరిశీలించారు. 

Updated Date - 2021-07-30T04:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising