ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబద్ధత గల ఉద్యమ నేత మద్దిలేటి

ABN, First Publish Date - 2021-10-15T05:34:57+05:30

పులి మామిడి మద్దిలేటి నిబద్ధత గల ప్రజా ఉద్యమ నాయకుడని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి రవి కీర్తించారు.

అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజాసంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి రవి

గద్వాల టౌన్‌, అక్టోబరు 14 : పులి మామిడి మద్దిలేటి నిబద్ధత గల ప్రజా ఉద్యమ నాయకుడని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి రవి కీర్తించారు. మద్ది లేటి ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని గురు వారం పట్టణంలోని రెండవ రైల్వే గేటు సమీపంలోని అమరుల స్తూపం వద్ద  నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ‘రైతు వ్యతిరేక చట్టాలు - రైతాంగ ఉద్యమం - భవిష్యత్తు పోరాటాలు’ అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నెగంటి రవి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎదురయ్యే ఇబ్బం దులు, వ్యవసాయరంగంలో కార్పొరేట్‌ శక్తుల పెత్తనం తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర,  రాష్ట్ర కోశాధికారి శంకర ప్రభాకర్‌, టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఆలూరు ప్రకాష్‌గౌడ్‌, పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండీ సుభాన్‌,  తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌యాదవ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజ నేయులు, జేఏసీ కన్వీనర్‌ మధుసూదన్‌ బాబు, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్‌ ఇక్బాల్‌ బాషా, కృష్ణయ్య, సత్యారెడ్డి, హనుమంతు తదితరులు ఉన్నారు. రాష్ర్టాల హక్కులను హరిస్తూ కేంద్ర ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి జలాల బోర్డు గెజిట్‌ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. 

Updated Date - 2021-10-15T05:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising