కరోనాతో కానరాని సందడి
ABN, First Publish Date - 2021-03-29T05:08:50+05:30
మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం రాత్రి కాముని దహనం నిర్వహించి జాగారం చేసి ఉదయం అందరు కలిసి రంగులు చల్లుకుని హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
- కాలనీల్లో చిన్నారుల హోలీ వేడుకలు
నవాబ్‌పేట, మార్చి 28 : మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం రాత్రి కాముని దహనం నిర్వహించి జాగారం చేసి ఉదయం అందరు కలిసి రంగులు చల్లుకుని హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ఆసక్తి చూపని యువత
మిడ్జిల్ : కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసరడంతో హోలీ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆదివారం హోలీ పండుగను నిర్ణయించినప్పటికీ గ్రామాల్లోని పెద్ద సంఖ్యలో హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు యువతతో పాటు ప్రజలు ముందుకు రాలేదు.
డోలు వాయిస్తూ...
హన్వాడ : మండల ప్రజలు హోలీ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ నాయకులు డోలుతో వీధుల్లో తిరిగి సంబురా లు జరుపుకున్నారు.
సాదాసీదాగా...
భూత్పూర్ : హోలీ పండుగను యువకులు, మహిళలు, చిన్నారులు సాదాసీదాగా జరుపుకున్నారు. కరోనా కేసుల ప్రభావంతోనే ఇండ్ల నుంచి హోలీ ఆడడానికి ప్రజలు బయటికి రాలేదు. భూత్పూర్‌లో టీఆర్‌ఎస్ యువకులు రంగులతో కాసేపు వేడుకులను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దేవరకద్ర నియోజవర్గ ప్రజలకు హోలి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా హోలీ
జడ్చర్ల : మండలంలో చిన్నారులు, మహిళలు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు హోలీ పండుగను జరుపుకోనున్నారు.
అడ్డాకుల : అడ్డాకుల మండలంలో ఆదివారం హోలీవేడుకలను యువ కులు, మహిళలు ఘనంగా నిర్వహించారు. పొన్నకల్‌లో ఎంపీపీ నాగార్జు న్‌రెడ్డి, శాఖాపూర్‌లో మహిళలు కామున్ని ఊరేగించారు.
Updated Date - 2021-03-29T05:08:50+05:30 IST