ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుతో బుద్ధి చెప్పాలి

ABN, First Publish Date - 2021-03-09T04:42:33+05:30

టీఆర్‌ఎస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతూన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

కొల్లాపూర్‌ రూరల్‌/ అచ్చంపేట టౌన్‌, మార్చి 8 : టీఆర్‌ఎస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. కొల్లాపూర్‌లోని ఎస్‌ఎం ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పట్టభధ్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి ఎదరు నిల్చే దమ్ము టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. గెజిటేడ్‌ ఉద్యోగ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్‌ గౌడ్‌ ఒక గ్రూప్‌ వన్‌ నోటిఫికేషన్‌ ఇప్పించలేకపోయాడు అని విమర్శించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, టీడీపీ, బహుజన సంఘాలు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయాయి అని విమర్శించారు. తెలంగాణలో పట్టపగలు వకీల్‌ దంపతులను రోడ్డుపై నరకి చంపడం జరిగిందన్నారు. ప్రజలపై కూడా పోలీసుల ప్రతాపం చూపుతున్నారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పార్లమెంట్‌ ఇన్‌చార్జి బాంగారు శృతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మహిళల వ్యతిరేకి అన్నారు. కేసీఆర్‌ తన బిడ్డకు నామినేటెడ్‌ పోస్టు ఇచ్చి పీవీ కుమార్తెను మాత్రం ప్రత్యేక్ష ఎన్నికల్లో దింపి అవమానానికి గురి చేస్తున్నారు అని విమర్శించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా అచ్చంపేలో నిర్వహించిన బీజేబీ సన్నాహక సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొని పట్టభద్రులను బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరాఉ. ఎన్నికల ఇన్‌చార్జి దేశ్‌ పాండే, బీజేపీ నాయకులు దీలీప్‌ చారి, రమేష్‌, బుడ్డన్న, శేఖర్‌గౌడ్‌, సాయికృష్ణ గౌడ్‌, సాయిప్రకాశ్‌, శివుడు, అన్వేష్‌, మహేష్‌ ఉన్నారు. 



Updated Date - 2021-03-09T04:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising