ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానం ఎందరికో ప్రాణదానం

ABN, First Publish Date - 2021-10-30T04:38:11+05:30

రక్తదానం ఎందరికో ప్రాణదానం అవుతుం దని, ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలుగా మారాలని జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

రక్తదానం చేస్తున్న ఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

- అమరుల సంస్మరణలో భాగంగా రక్తదానం

- 160 యూనిట్లు సేకరణ


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 29 : రక్తదానం ఎందరికో ప్రాణదానం అవుతుం దని, ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలుగా మారాలని జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందు లు ఉండవని అన్నారు. ఆరోగ్యవంతులు ప్రతీ మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చన్నారు. పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవా రం జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదా న శిబిరంలో పోలీసులు రక్తదానం చేశారు. జిల్లా సహా 160 మంది పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాటట్లాడుతూ రక్తదానం అనేది ఎంతో మందికి ఉపయోగపడుతుందని, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డుప్రమాదంలో గాయపడిన వారికి రక్తస్రావం జరుగు తుందని, అలాంటి వారికి మొదటి గంటలో రక్తం అందించడం వల్ల దాదాపుగా ప్రాణాలు కాపాడవచ్చన్నారు. దాతలు ఇచ్చే రక్తం ఆపద సమయంలో క్షతగా త్రుల ప్రాణాలు కాపాడుకునే ందుకు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా గర్భిణి ప్రసవ సమయంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల తల్లీబిడ్డకు ఇబ్బంది ఎదురవుతుందని, అలాంటి సమయంలో రక్తం అందించడం వల్ల తల్లీబిడ్డలను కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. రెడ్‌క్రాస్‌, లయన్స్‌క్లబ్‌ వంటి స్వచ్ఛంద సంస్థలకు రక్తం అందించడానికి పోలీస్‌శాఖ ప్రధాన వనరుగా ఉపయోగపడు తుందని చెప్పారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ టి శ్రీని వాసులు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షు డు వెంకటయ్య, ఇన్‌స్పెక్టర్లు సురేశ్‌, అప్పల నాయుడు, శ్రీనివాస్‌, అశోక్‌, హనుమప్ప తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising