ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీ రోడ్డు కోసం బీజేవైఎం పాదయాత్ర

ABN, First Publish Date - 2021-10-18T04:21:26+05:30

మండలంలోని గున్ము క్ల నుంచి గుడిగండ్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదివారం బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

గున్ముక్ల నుంచి పాదయాత్ర చేస్తున్న బీజేవైఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దన్వాడ, అక్టోబరు 17 : మండలంలోని గున్ము క్ల నుంచి గుడిగండ్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదివారం బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. రహదారి వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గున్ముక్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి గుడిగెండ్ల వద్ద జాతీయ రహదారి పై బైఠాయుంచారు. గతంలో పలుమార్లు బీటీ రోడ్డు కోసం అధికారులకు విన్నవించినా పట్టించుకో వడం లేదంటూ వాపోయారు. బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ము ట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేవైఎం మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, కురుమూర్తి, చక్రి పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని గుడిగండ్ల గ్రామం నుంచి ధన్వాడ మండలం మంత్రంపల్లి వరకు రెండు కిలోమీటర్లు బీటీ రోడ్డు మం జూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం గుడిగండ్ల గ్రామంలో ఎన్‌హెచ్‌ 167 రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తమ నిరసనను తెలిపారు. అంతకుముందు ఆ పార్టీ నాయకులు మంత్రంపల్లి నుంచి గుడిగండ్ల గ్రామం వరకు పాదయాత్ర చేపట్టారు. బీజేవైఎం మండలాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మక్తల్‌ ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టగా నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. 

Updated Date - 2021-10-18T04:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising