ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-26T04:56:15+05:30

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి రూరల్‌, అక్టోబరు 25: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు.  పట్టణంలోని వివిధ పరీక్ష కేంద్రాలను సోమవా రం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నాయని,  నవంబరు 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వనపర్తి జిల్లాలో మొత్తం ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 7034 మంది పరీక్షలు రాయాల్సి ఉన్నదని తెలిపారు. ఇందులో 653 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు 90.72 శాతం నమోదైనట్లు ఆమె తెలిపారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం, సాయంత్రం శానిటైజేషన్‌ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్ష కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటు ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు  కలెక్టర్‌ తెలిపారు.  ఆత్మకూరులో జనరల్‌ విద్యార్థులు 114 మంది హాజరు కావాల్సి ఉండగా 13 మంది గైర్హాజరయ్యారని, వొకేషనల్‌ 157 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13 మంది గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. అదేవిధంగా వికాస్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 179 మంది విద్యార్థుల హాజరు కావాల్సి ఉండగా 28 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ సునీల్‌ తెలిపారు. పాన్‌గల్‌ మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులు పరీక్ష సమయానికి  గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకు న్నారు. మొత్తం 140 మంది విద్యార్థులకు గానూ 17 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు.





Updated Date - 2021-10-26T04:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising